Disabled People : అగ్ని ప్రమాదంలో తాటాకు ఇల్లు దగ్ధం నిరాశృయులైన వికలాంగుల కుటుంబం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, జనవరి 23, కడియం మండలంలోని మురమండ గ్రామంలో మురమండ దుళ్ళ రోడ్లో పశువుల హాస్పటల్ సమీపంలో నివసిస్తున్న వికలాంగులు భీమన సూరిబాబు, ఝాన్సీ లు నివాసుముంటున్న ఇల్లు అగ్నిప్రమాదంలో సామాగ్రి తో పాటు వస్త్రాల తో సహా పూర్తి గా అగ్గి కి ఆహుతయ్యాయి.

ఇన్చార్జివో దూడల రాఘవ ద్వారా సమాచారం అందుకున్న మండపేట ఫైర్ స్టేషన్ ఎస్ఐ.ఎఫ్.ఒ. జె. హనుమంతరావు ఆదేశాలతో ఎల్,ఎఫ్. ఎం. వెంకట్రావు సిబ్బంది తో మంటలను అదుపులో తెచ్చారు. వారు మాట్లాడుతూ సుమారు ఒక లక్షన్నర రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. సమాచారం అందుకున్న కడియం ఎమ్మార్వో ఎం.

సునీల్ కుమార్ ఆదేశాలతో స్థానిక విఆర్ఓ పి.ఏసు బాబు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితి సమీక్షించారు. మురమండ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాజమహేంద్రవరం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దేవళ్ళ రామ్మోహన్రావు ప్రమాద స్థలం చేరుకుని వారికి ధైర్యం చెప్పారు తక్షణ సహాయం కింద 2000 రూపాయలు అందజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Family of disabled people left helpless

You cannot copy content of this page

Scroll to Top