
–ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి.
–బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ
Excessive Fees : త్రినేత్రం న్యూస్ : కార్పొరేట్ పాఠశాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి, వాటిని వెంటనే నియంత్రించాలనీ బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ ప్రభుత్వాన్నికోరారు. శనివారం బిఆర్ ఎస్వీ ఆధ్వర్యంలో మండల విద్యా శాఖ అధికారి కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయనమాట్లాడారు….పేద,మధ్య తరగతి ప్రజలకు ప్రవేట్ స్కూల్లో చదివించాలి అనే ఆశ ఉంటుంది, కానీ ప్రవేట్ స్కూల్ యజమానాలు ఫీజు లను విచ్చలవిడిగా పెంచి, విద్యార్థులను ఇబ్బందికి గురిచేస్తునారు అని ఆయన ఆరోపించారు. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది అని తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు సరిగా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
వాటినికూడా వెంటనే పరిశీలించి వెంటనే సమస్యలను పరిష్కరించాలి ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో బిఆర్ ఎస్వీ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వీ దేవరకొండ మండల అధ్యక్షులు పాత్లవత్ లక్ష్మణ్, ఎస్ కే జమీర్ బాబా, పంది హరికృష్ణ, బత్తుల ఆంజనేయులు, కొర్ర రాజేష్,రాఖీ,అనిల్, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe