BRSV : బడ్జెట్ లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం

TRINETHRAM NEWS
There is a grave injustice

బిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు .

BRSV : దేవరకొండ డివిజన్ మార్చ్ 23, త్రినేత్రం న్యూస్. విద్యారంగంకు తీవ్ర అన్యాయం జరిగింది అని బిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు … అన్నారు. దేవరకొండ పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…… బడ్జెట్ కేవలం అంకెల గారడీ మాత్రమేనని ఆయన అన్నారు.రాష్ట్ర బడ్జెట్‌ లో విద్యారంగానికి కేటాయించిన 8.22శాతం మాత్రమే అని ఆయన అన్నారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో మొదటి బడ్జెట్ లో 15శాతం కేటాయింపు చేస్తామని ఇచ్చిన హామీ పూర్తిగా ఈ బడ్జెట్ లో కూడా విస్మరించింది అని ఆయన తెలిపారు.

విద్య రంగానికి కనీసం 10 శాతానికి కూడా కేటాయించక పోవడం దారుణం అని ఆయన అన్నారు.ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన అన్నారు.బడ్జెట్ లో100 కోట్లు రెనోవేషన్ కోసం కేటాయింపు చేశారు అని 100 కోట్లతో హస్టల్స్ ఎలా బాగుపడతాయని ఆయన అడిగారు.

గురుకుల అద్దె భవనాలు, కెజిబివిలు అదనపు బిల్డింగ్స్, సంక్షేమ వసతిగృహాల మౌళిక సదుపాయాలు ఈ అంశాలపై సరైన ప్రస్తావన లేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. విద్య రంగానికి బడ్జెట్ పెంచాలని గత బడ్జెట్ కు ఈ బడ్జెట్ కు పెంచినట్లు కనిపించేది కానీ విద్యకు తీవ్ర మెండిచెయ్యి చుపారని అని అన్నారు.ఉన్నత విద్యపై సవతి తల్లి ప్రేమ కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తోంది అని ఆయన అన్నారు.
బడ్జెట్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలపై ప్రభుత్వం 4,343కోట్లు కేటాయింపు చేస్తామని చెప్పారు .ప్రభుత్వం ఇప్పటికైనా మాటలకే పరిమితం కాకుండా, విద్యార్థుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ, మండల అధ్యక్షులు పాత్లవత్ లక్ష్మణ్, కౌన్సిలర్ పొట్ట మధు, జమీర్ బాబా, మైనంపల్లి ప్రవీణ్, చాట్ల ప్రశాంత్, ఎర్ర విజయ్, బత్తుల ఆంజనేయులు, వెంకట్,అంజి,రమేష్, తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top