రియల్ ఎస్టేట్ చిట్టిల వ్యాపారాల నుండి ప్రైవేట్ పాఠశాలకు పెట్టుబడుల వైపు అడుగులు.
రాజకీయ నాయకుల మరియు ఉపాధ్యాయ సంఘ నేతల అండదండలతో వ్యాపారాలు మూడు పూలు ఆరుకాయలుగా విస్తరిస్తున్నారు.
ఆరోగ్య కారణాలంటూ డిప్యూటేషన్లు.
ప్రభుత్వ పాఠశాలలకు తరచూ డుమ్మాలు.
ప్రైవేటు పాఠశాలలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ బడుల పంతుల్లు. ప్రైవేట్ పాఠశాలలో ఎల్కేజీ నుండి దోపిడీ.
అధిక ఫీజులు వసూలు చేస్తున్న, అధిక ధరల పుస్తకాలు అమ్ముతున్న పట్టించుకోని విద్యాశాఖ అధికారులు.
మామూళ్లతో ప్రైవేట్ పాఠశాలల వైపుచూసి చూడనట్టుగా నాకేమీ తెలియదు అన్నట్లుగా వ్యవ హరిస్తున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ………..
దేవరకొండ జూన్ 22 త్రినేత్రం న్యూస్. విద్యను అందించే గురువు సాక్షాత్తు దైవంతో సమానం అని నానుడి. కానీ ప్రస్తుత పరిస్థితులలో విద్య వ్యాపారాము గా మారినది. కొంతమంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కార్పొరేట్ పాఠశాలలతో చేతులు కలిపి అందులో పెట్టుబడులు పెట్టి ప్రైవేట్ పాఠశాలలను ప్రోత్సహిస్తున్నారు. వీళ్లకు ప్రభుత్వం జీతాలు ఇచ్చేది ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని, విద్యార్థు లను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని కానీ వీళ్లు మాత్రం ప్రభుత్వ పాఠశాలకు రాకుండా సరిగా సమయపాలన పాటించకుండా గుడ్డి లో మెల్ల అన్నట్లుగా వాళ్ల ఇష్టం వచ్చినప్పుడు రావడం లేదా రాకపోవడం, వీళ్లు ప్రైవేట్ పాఠశాలలను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు విద్యాశాఖ అధికారులు సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నారు.
విద్యాశాఖ అధికారులు మామూళ్ల నెపంతో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఇలాంటి వారి పైన పై అధికారులైన చర్యలు తీసుకొని ప్రభుత్వపాఠశాలల అభివృద్ధి చెందే విధంగా చూస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు అధికారులను కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యనందించే ఉపాధ్యాయులు నేడు ప్రైవేటు పాఠశాలలో పెట్టుబడులు పెట్టి విద్యార్థులను అందులో చేర్చే విధంగా బలవంతంగా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్నారని చర్చ జరుగుతోంది.
రాజకీయ నాయకుల, విద్యాశాఖ అధికారుల అండదండలతో ప్రైవేట్ పాఠశాలలో పెట్టుబడులు పెట్టిన ఉపాధ్యాయులు తమకు అనుకూలంగా ఉన్న ఊర్లలో, తాము పెట్టుబడులు పెట్టిన చోట తమ ఉద్యోగాలను బదిలీలు చేసుకొని తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు కావడం లేదు. ప్రతి ఏటా విద్యార్థుల తల్లిదండ్రులతో ఫీజుల నియంత్రణ గురించి ప్రత్యేక సమావేశం చర్చ నిర్వహించి ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని ఉంది.
పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్, టై, బెల్ట్, షూస్ వంటి వాటితో పాటు ఒక్కో తరగతికి వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మలుచుకున్న పరిస్థితి ఏర్పడింది. ప్రైవేట్ పాఠశాలలో కనీస వసతులు మరియు కనీస అర్హత ఉపాధ్యాయులను ఏర్పాటు చేయకపోయినా డబ్బులు దండుకోవడంలో పరిపాటుగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దారిద్యరేఖకు దిగువన ఉన్న విద్యార్థులకు ఫీజులో 25% రాయితీ కల్పించాలని ఉన్న, కానీ అది ఎక్కడ ఆచరణలోకి రాకపోవడం విశేషం. గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులను
తరలించే స్కూల్ బస్సులు కనీస నిబంధనలను పాటించడం లేదని విమర్శలు వస్తున్నాయి. అయినా పర్య వీక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు తమకేమీ ఎరగనట్లుగా వ్యవహరిస్తున్న తీరుకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల ప్రమేయం దాగి ఉందని వాదన వినిపిస్తుంది. నెలవారి భారీ మొత్తంలో ముడుపులు అందుకోవడం వల్లే ప్రైవేటు పాఠశాలల వైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు ఉన్నతాధికారులు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులపై వారి కదలికలపై నిఘా ఉంచి ప్రైవేట్ పాఠశాలలకు వంత పాడుతున్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ముక్కుకుతాడు వేయాల్సిన ఆవశ్యకత ఉందని వాదన వినపడుతుంది.
పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలలకు కనీస అనుమతులు లేకుండానే నెలకొల్పుతున్నారని ప్రచారం జరుగుతుంది. జిల్లా కేంద్రంలోని కొంతమంది అధికారులతో సత్సంబంధాలు ఏర్పరచుకొని ప్రైవేట్ పాఠశాలల ఉనికిని చాటుతున్నారని వినికిడి. ఒక్కో పాఠశాలకు రిటైర్డ్ ఉద్యోగులు, మరియు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తెరవెనుక ఉండి పర్సంటేజీల కోసం భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేద మధ్యతరగతి విద్యార్థు లను వారికి సంబంధించిన ప్రైవేట్ పాఠశాలలో బలవంతంగా చేర్చుకున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రకంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమం లో విద్యార్థులు ఆశించినంతగా రాలేదని విమర్శలు వస్తున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


