బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.
దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 05 , త్రినేత్రం న్యూస్. ప్రతి ఒక్కరూ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అనుగ్రహం పొందాలి అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
దేవరకొండ పట్టణంలోని 5వ వార్డులో శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్ల దేవాలయంలో నిర్వహించిన 24వ ద్వాదశ జ్యోతి లింగాల అభిషేక మహోత్సవ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని ప్రత్యేక పూజ బులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని ఆయన అన్నారు. ఆయన వెంట, బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బిల్యా నాయక్ , కిషన్ నాయక్ , పలువురు బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


