ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి..
-కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే సర్పంచ్ ఎన్నికల్లో ఓటు తో సమాధానం చెప్పండి…
-కాంగ్రెస్ చేసిన మోసం ప్రజలకు అర్ధమైంది.
-రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది
-బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 05 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో చింతపల్లి మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన 15కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే సర్పంచ్ ఎన్నికల్లో ఓటు తో సమాధానం చెప్పాలని ఆయన కోరారు.కాంగ్రెస్ చేసిన మోసం ప్రజలకు అర్ధమైంది అని ఆయన అన్నారు.రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, అల్వాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BRS party membership surges

You cannot copy content of this page