Ramavat Ravindra Kumar : ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి

TRINETHRAM NEWS

శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ .

కొండమల్లెపల్లి ఫిబ్రవరి 28, త్రినేత్రం న్యూస్. ప్రతి ఒక్కరూ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి అని బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.

శనివారం కొండమల్లెపల్లి మండలం బుడ్డోని తండాలో శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని ఆయన ఆకాంక్షించారు.దైవ చింతనతో మానసిక ప్రశాంత లభిస్తుందని ఆయన తెలిపారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యానాయక్ , నేనావత్ కిషన్ నాయక్,ఆలయ కమిటీ సభ్యులు,స్థానిక ప్రజాప్రతినిధులు,స్వామి వారి భక్తులు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Everyone should receive the blessings of Lord Venkateswara

You cannot copy content of this page

Scroll to Top