New Municipal Council : మున్సిపాలిటీ నూతన పాలక మండలి కి ఘన సత్కారం

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 28, త్రినేత్రం న్యూస్. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం నందు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ కి వైస్ చైర్మన్ కి కౌన్సిలర్స్ కి ఘనంగా సత్కరించుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎన్ వీ టీ మాట్లాడుతూ గెలిచిన వారిలో యువకులు ఎక్కువ సంఖ్యలో ఉండడం సంతోషకరం, అనుభవ ఆజ్ఞలు ఉండడం, అలాగే 19 వాడు కౌన్సిలర్ దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్ హ్యాడ్రిక్ గెలవడం అనేది అభినందనీయమని, ప్రజల నిర్ణయం కాలనీ ప్రజలకు ఎంతో సేవ చేస్తే కానీ మూడుసార్లు ఎన్నుకోరు.

అలాగే ప్రజాసేవ చేయడం అనేది అందరికీ రాదు అది గాడ్ గిఫ్ట్ కాబట్టి మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్లకు సేవ చేస్తూ మిమ్మల్ని నమ్ముకొని ఎలా ఎన్నుకున్నారు అలాగే మీరు కాలనీ ప్రజల అవసరాలను తీరువాలని అన్నారు. అలాగే దేవరకొండలో ఇండోర్ అవుట్డోర్ స్టేడియాలని నిర్మాణం చేయాలని అన్నారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని, క్రీడాకారులకు ఇండోర్ అవుట్డోర్ స్టేడియాల కోసం కృషి చేస్తామని అన్నారు.

దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ వారికి మా సహాయ సాకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, గౌరవ అధ్యక్షులు పంతులాల్ నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్ల సురేష్ ,సన్నీ, జమీర్, వంగూరు వెంకటేశ్వర్లు, బొడిగ వెంకటేష్, మహమూద్, భాస్కర్ రెడ్డి, బత్తుల అమర్, వైయస్ కరుణాకర్, జయలక్ష్మి, రాజేష్ ,కిరణ్ ,సాయి, మల్లయ్య, క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The new municipal council was felicitated

You cannot copy content of this page

Scroll to Top