జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Everyone should contribute their part

తీదేడు గ్రామ శ్రీ శ్రీ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలి

ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి .. తీదేడు గ్రామ సర్పంచ్

Everyone should Contribute : చింత పల్లి మే 19, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం తీదేడు గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దక్షిణ మండపం నిర్మాణానికి గ్రామ ప్రజలు,యువత స్వచ్ఛందంగా విరాళాలు అందించడం అభినందనీయమని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్ అన్నారు.ఈ సందర్భంగా తీదేడు గ్రామానికి చెందిన మర్రు జయసుధ – సురేందర్ రావు దంపతులు రూ.1,00,116/- (ఒక లక్ష నూట పదహారు రూపాయలు) విరాళంగా అందించగా, తీదేడు బిసి కాలనీ యూత్ ఆధ్వర్యంలో రూ.20,116/- (ఇరవై వేల నూట పదహారు రూపాయలు) విరాళంగా అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…శ్రీ శ్రీ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దక్షిణ మండప నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.ఆలయ అభివృద్ధికి గ్రామ ప్రజలు ఐక్యంగా ముందుకు రావడం సంతోషకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్లు ధరణిపతి రమణారావు, ఉలుపాల శేఖర్ రెడ్డి, సోనగంటి గోవర్ధనాచారి, పి.ఏ.సి.యస్ డైరెక్టర్ తిరుమణి పాపయ్య, గ్రామ ప్రజలు సిమర్ల శ్రీను యాదవ్, బొడ్డు యాదగిరి, బెక్కం సైదులు,శివర్ల ప్రవీణ్,బెక్కం సాయి కుమార్, మొరుపోజు రాజు, మునగాల రవి, మునగాల లక్ష్మణ్, ఐతమోని కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page