జూలై 7, 2026

WhatsApp Image 2023 12 28 at 12.18.57 PM

TRINETHRAM NEWS

2023 ముగింపు…వచ్చే ఏడాది2024 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్

ఉచితంగా ఆధార్ వివరాలు మార్చుకునేందుకు చివరి తేదీ డిసెంబర్ 31

జనవరి 1 నుంచి కొత్త సిమ్ కొనుగోలుకు డిజిటల్ కేవైసీ తప్పనిసరి

డీమాట్ అకౌంట్ నామినేషన్, బ్యాంక్ లాకర్ల రివైజ్డ్ అగ్రిమెంట్‌కు డిసెంబర్ 31 తుది గడువు

మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలో అడుగిడబోతున్నాం. దీంతో పాటూ బ్యాంకింగ్, ఇతర విషయాల్లో పలు కీలక మార్పులు రానున్నాయి. అవేంటంటే..

డీమాట్ అకౌంట్ హోల్డర్లు జనవరి 1 లోపు తమ నామినేషన్ వివరాలు సమర్పించాలి. ఈ రూల్ పాటించని వాళ్లు స్టాక్స్‌తో ఎటువంటి లావాదేవీలు నిర్వహించలేరు.
ఆధార్‌ కార్డు వివరాల్లో ఉచితంగా మార్పులు చేసుకునేందుకు డిసెంబర్ 31 చివరి తేదీ. ఆ తరువాత చేసుకునే మార్పులకు రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

సిమ్ కార్డుల కేవైసీ ధ్రువీకరణ మొత్తం ఇకపై డిజిటల్ రూపంలోనే జరుగుతుంది. ఎటువంటి దరఖాస్తులు నింపాల్సిన అవసరం ఉండదు. కొత్త సిమ్ కొనుగోలు సమయంలో టెలికాం కంపెనీలు కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తాయి. మోసాలకు కళ్లెం వేసేందుకు ఈ నిబంధన ప్రవేశపెట్టారు.
బ్యాంక్ లాకర్లు ఉన్న వారందరూ డిసెంబర్ 31లోపు తమ బ్యాంకులతో రివైజ్డ్ అగ్రిమెంట్లు కుదుర్చుకోవాలి. లేకపోతే, లాకర్‌ను ఫ్రీజ్ చేస్తారు.

కొత్త టెలీకమ్యూనికేషన్ బిల్లు ప్రకారం, ఫేక్ సిమ్‌లు కొనుగోలు చేసేవారికి మూడేళ్ల జైలు, రూ.50 లక్షల జరిమానా విధిస్తారు.
2022-23 సంవత్సరానికి చెందిన ఐటీ రిటర్నుల దాఖలుకు డిసెంబర్ 31 చివరి తేదీ. ఈలోపు పెనాల్టీతో సహా రిటర్నులు దాఖలు చేయాలి.

You cannot copy content of this page