సెప్టెంబర్ 26, 2026
TRINETHRAM NEWS
Shekhar Reddy

—ఎస్ ఐ ఆర్ నోటీసులు అందుకున్న వారందరూ హాజరు కావాలి.

— తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి.

Shekhar Reddy : చింతపల్లి / సెప్టెంబర్ 26, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం తీదేడు గ్రామంలో ఎస్ ఐ ఆర్ ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లకు ఈయరింగ్ కార్యక్రమం సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ నిర్ణయించిన తేదీ సమయంలో అవసరమైన ఆధారాలు మరియు పత్రాలను సమర్పించి తమ వివరాలను సరిచేసుకోవాలని సూచించారు.అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షణకు సహకరించాలని 18 సంవత్సరాలు నిండిన యువత కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పి.ఏ.సి.యస్ డైరెక్టర్ తిరుమణి పాపయ్య,గ్రామ పాలక వర్గం సభ్యులు మాదగోని కృష్ణ గౌడ్,రెడ్డి పద్మ పరమేష్ ముదిరాజ్,మర్ల యాదగిరి,శివర్ల పర్వతాలు యాదవ్, గ్రామస్తులు వల్లపు రాములు,మర్ల శ్రీరాములు,గంటెల రామనాథం,దాసరి మల్లయ్య, జూనియర్ అసిస్టెంట్స్ శ్రీనివాస్ రెడ్డి, రజిత,నవీణ,బి.యల్.ఓలు చింతకుంట్ల అంజమ్మ,గంటెల చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

డ్యూటీలో మీ మొబైల్‌కి ఫుల్ ఛార్జింగ్ బ్యాకప్!

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page