జూలై 7, 2026
TRINETHRAM NEWS
Employment Guarantee Act

Employment Guarantee Act : అల్లూరి సీతారామరాజు జిల్లా, జూన్ 13, అరకులోయ, (త్రినేత్రం న్యూస్) : కేంద్రంలో రాష్ట్రంలో బిజెపి తెలుగుదేశం జనసేన కూటమీ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఉపాధి హామీ చట్టాన్ని సవరణచేసి విబిజీ రామ్ జీ పథకం కింద మార్పు చేసిందని ఆదివాసీల,ఇతరపేద కూలీల పొట్టలు కొట్టే విధంగా మార్పులు ఉన్నాయని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అరకువేలి మండలం చొంపి గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి పని ప్రదేశంలో నిరసన తెలిపారు.
ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ చట్టం సవరణతో ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం చేసేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయని కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులు భారీ కోత విధించిందని పార్లమెంట్ లో టీడీపీ జనసేన కూటమీ ఎంపీలు చేతులెత్తి ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం చేసి రాష్ట్రంలో ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలకు ఉపాధి కూలీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంల్లో సిగ్నల్ సక్రమంగా లేకపోవడంతో ఉపాధి పని ప్రదేశాల్లో హాజరు నమోదు కావడం లేదని రోజు రెండు ఫోటోలు తప్పనిసరి చెయ్యడంతో ఉపాధి కూలీలకు అగచాట్లు పడుతున్నారని చేసిన పనులకు డబ్బులు సక్రమంగా అందే పరిస్థితులు లేవని తక్షణమే ముఖ హాజరు రద్దు చేయాలని వీబీజీ రామ్ జి పథకం పేరు మారుమార్పుతో గతంలో కేంద్రం ప్రభుత్వం ఇచ్చే వాటా 90 శాతం నుండి 60 శాతానికి తగ్గించడం వలన రాష్ట్రాలపై పెను భారం పడుతుందని దీంతో రాష్ట్రంలో ఉపాధి కూలీలు పనులు కల్పించడం బకాయి కూలీలు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరిగే పరిస్థితి నెలకొంది ఉపాధి కూలీలు పనికి దూరమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఉపాధి చట్టాన్ని ఎత్తివేసేందుకే కేంద్రంలో ఉన్న బిజెపి కుట్ర చేస్తుందని మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమీ పార్టీలు పూర్తిగా మద్దతు ఇస్తున్నాయని తెలిపారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పాత పద్ధతిలో కొనసాగించాలని ఉపాధి కూలీలకు రోజుకూలీ 600 పెంచాలని 200 రోజులుపని కల్పించాలని పని పరికరాలకు అదనపు డబ్బులు ఇవ్వాలని పని ప్రదేశాల్లో టెంటు , మంచి నీరు, మెడికల్ కిట్లు వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు లేకుంటే ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు ఎస్ నాగేంద్ర ఉపాధి కూలీలు భీమన్న, నాగేశ్వరావు, సాయికుమార్, గురు, రాము, సన్యాసమ్మ, సుందరమ్మ, సత్యావతి, లక్ష్మి,రంభ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page