Electricity Problems : శరభగుడ కాలనీలో విద్యుత్ సమస్యలు తీవ్రం

TRINETHRAM NEWS

తక్షణమే పరిష్కరించాలి – గిరిజన సంఘం డిమాండ్.

అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ జూలై 20: అరకువేలి మండలానికి సమీపంలో ఉన్న శరభగుడ హౌసింగ్ కాలనీలో పదిరోజులుగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అప్రకటితంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్రీ ఫేస్ విద్యుత్ మంజూరై ఏడాది అయినా అధికారులు పనులు ప్రారంభించకపోవడంపై ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద నిరసన తెలిపారు.
జిల్లా గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి పొద్దు బాలాదేవ్ మాట్లాడుతూ, పలు మార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించలేదన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ఓవర్‌లోడ్‌తో తీగలు కాలిపోతున్నాయని, లోవోల్టేజీ సమస్యతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ “స్తంభాలు లేవు” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
ఈ నిరసనలో డి. రమణ, కె. అప్పన్న, జి. బుజ్జీ, ఎల్. బి. భాగ్య, ఎస్. తార, కె. ఆశిష్, కె. అవినాష్, కె. సాయి, కె. దేబోరా, ఎల్. బి. నవనీత్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Electricity problems in Sarabhaguda

You cannot copy content of this page

Scroll to Top