త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) నియోజకవర్గఇంచార్జ్ : అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలం, కినపర్త పంచాయతీ, చుట్టు బంద గ్రామం లో గత నాలుగేళ్లుగా మరమ్మత్తులకు నోచుకోని చెక్ డాం గేట్లు. ఆందోళన చెందుతున్న రైతులు
నాలుగేళ్లుగా చుట్టు బంధ గ్రామంలో గల తొలుకుల గెడ్డ రిజర్వాయర్ మరమ్మతులకు నోచుకోక రెండు వందల ఎకరాల్లో సాగుచేసే రైతులు పంటలు పండించుకునేందుకు నీరు అందక ప్రశ్నార్థకంగా మారిందని, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొయ్యూరు మండలం, కినపర్తి పంచాయతీ చుట్టు బంధలో ఉన్న తోలుకులగెడ్డ రిజర్వాయర్ ఏళ్ల తరబడి ఉంది. ఈ రిజర్వాయర్ పై వలసంపేట, భీమవరం, చుట్టు బంద, రిట్టమానుపాలెం తదితర గ్రామాలు రైతులు సుమారుగా 200 ఎకరాలు పైగా వరి, మిరప, వంగ, పత్తి, టమాట, సాగు చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో సాగు చేసుకునే రైతులకు ఈ రిజర్వాయర్ ఎంతగానో ఉపయోగపడేది. నాలుగేళ్లుగా ఈ రిజర్వాయర్, రెండు చెక్ డాములు మరమ్మతులకు గురై రిజర్వాయర్లో నీరు పంట కాలువలకు వెళ్లే పరిస్థితి లేదు. దీనికి తోడుగా పంట కాలువలు కూడా ఏళ్ల తరబడి పూడిక తీతలు తీయకపోవడం తో పలుచోట్ల కాలువలు గండి కొట్టి అద్వానంగా మారిందని రైతులు అంటున్నారు. ఈ విషయమై పలుమార్లు సంబంధిత ఇరిగేషన్, ఉపాధి హామీ అధికారులకు ఫిర్యాదులు చేసిన స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు.
ఈ రిజర్వాయర్ ఉన్నప్పటికీ అలంకారప్రాయంగా తప్ప వర్షాదారంతోనే పంటలను సాగు చేసుకోవలసిన పరిస్థితులు వచ్చాయని రైతులు అంటున్నారు. అతివృష్టి, అనావృష్టితో పంటలకు భారీ నష్టాలు వచ్చే పరిస్థితులు ఎదుర్కొంటున్నామన్నారు. అదే రిజర్వాయర్ వినియోగంలో ఉంటే నష్టాలు వచ్చినప్పుడు ఈ నీరు వాడుకొని లాభాల బాటలో ఉంటామన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెక్ డాములు మరమ్మత్తులు, పంట కాలువలు పూడికతీతలు చేపట్టాలని రైతులు రుత్తల రామకృష్ణ, మల్లేశ్వరరావు, గోవింద, తదితరులు కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


