WhatsApp Image 2024 03 29 at 15.03.25
Trinethram News : పిఠాపురం నుండి మొదలు కానున్న వారాహి విజయ యాత్ర. మూడు రోజులు పాటు పిఠాపురంలో జనసేన అధినేత పర్యటన, మరియు వారాహి బహిరంగ సభ.
పిఠాపురం తరువాత పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రలో పర్యటన. ఏప్రిల్ 4వ తేదీ నుండి ఉత్తరాంధ్ర పర్యటన. ఏప్రిల్ 4వ తేదీన నెల్లిమర్లలో బహిరంగ సభ. ఏప్రిల్ 5 వ తేదీన అనకాపల్లి, 6వ తేదీన ఎలమంచిలి, 7వ తేదీన పెందుర్తి నియోజకవర్గాల్లో బహిరంగ సభలు.ఆ తరువాత విశాఖ సౌత్ నియోజకవర్గ పర్యటన.
జనసేన పార్టీ పోటీ చేసే 21 స్థానాల్లో రెండు సభలు చొప్పున 42 సభలు ఉంటాయి. అలాగే జనసేన పార్టీ పోటీ చేసే పార్లమెంట్ స్థానాల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు ఉంటాయి. జనసేన పార్టీ అభ్యర్థుల తరుపున 50 సభల్లో పాల్గొనున్న జనసేనాని.వీటితో పాటు బీజేపీ, టీడీపీ అభ్యర్థుల తరుపున కొన్ని సభల్లో పాల్గొనున్న జనసేనాని.
