అల్లూరుజిల్లా త్రినేత్రం న్యూస్ అరకులోయ ఏప్రిల్ 20: ప్రపంచ ప్రాఖ్యాతిగాంచిన ఆర్గానిక్ కాపీ ఉత్పత్తి చేస్తున్న ఆదివాసి ప్రాంతం పాడేరు ఐ టి డి ఏ పరిధిలో కాఫీ పరిశ్రమ ఏర్పాటు చేసి ఆదివాసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదివాసి గిరిజన సంఘం అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ డిమాండ్ చేశారు.
అరకు లోయ ఆదివాసి గిరిజన సంఘం భవనంలో మీడియా సమావేశంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మండల అధ్యక్షులు జి చిన్న బాబు మండల ఉపాధ్యక్షులు కిల్లో జగన్నాథం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో కాఫీ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ఆదివాసులకు తీవ్ర అన్యాయం చేయడమేనని పాడేరు ఐటిడిఏ 11 మండలాల పరిధిలో ప్రపంచ ప్రాఖ్యాతిగాంచిన ఆర్గానిక్ కాఫీ ఆదివాసి రైతులు పండిస్తున్నారని సుమారు లక్షల 30 వేల మంది రైతులు 2 లక్షల ఎకరాల్లో 15 వేల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తి చేస్తున్నారని ఆదివాసి ప్రాంతంలో కాఫీ పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా మైదాన ప్రాంతంలో కాఫీ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ప్రయోజనం కోసమని ఆదివాసి ప్రాంతంలో ఐటీడీఏ ద్వారా కాఫీ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆదివాసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదివాసి ప్రాంతంలో పండిస్తున్న కాఫీ పంటను మైదాన ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆదివాసులకు అన్యాయం చేస్తే సహించేది లేదని ప్రభుత్వానికి హెచ్చరించారు.
2018 నుండి నేటి వరకు ఆర్గానిక్ కాఫీ పండిస్తున్న రైతులకు సుమారు 60 కోట్ల బకాయి తక్షణమే చెల్లించాలని కాపీ తోటల అభివృద్ధి కోసం ప్రోత్సాక నిధులు విడుదల చేయాలని కాఫీ తోటలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కాఫీ తోటలో ప్రమాదాన్ని గురవుతున్న రైతులకు భీమా పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం నాయకులు కిల్లో దొబులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


