Drug Awareness : ఎండపల్లివలస కేజీబీవీ లో మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా, అరకులోయ త్రినేత్రంన్యూస్ జూలై 21 : ఎండపల్లివలసలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్. హిమగిరి, ఎస్ఐ జి. గోపాలరావు, ట్రైనింగ్ ఎస్‌ఐ మేడం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు గంజాయి, మద్యం, ఇతర మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు వివరించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యపరంగా, భవిష్యత్ పరంగా ఎదురయ్యే ప్రమాదాలను చాటి చెప్పారు. చట్టపరమైన విషయాల్లో అవగాహన పెంచుకోవాలని, ఈ రకమైన పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థినిలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Drug awareness program at

You cannot copy content of this page

Scroll to Top