AITUC : సింగరేణి ఇంటెక్ వెల్ దగ్గర ప్లేడే రోజు కూడా షిఫ్ట్ కి ఇద్దరు పంపు ఆపరేటర్లను కేటాయించాలి.

TRINETHRAM NEWS

ఒక్కరినే కేటాయించడం వల్ల అనేక అనర్థాలు జరిగే అవకాశం ఉంది.

ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి సహాయ కార్యదర్శి రంగు శ్రీను డిమాండ్.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి సహాయ కార్యదర్శి రంగు శ్రీను డిమాండ్ చేశారు. ఆదివారం గోదావరినది వద్ద ఉన్న సింగరేణి ఇంటెక్ వెల్ ను ఆయన సివిల్ డిపార్ట్మెంట్ ఏఐటియుసి కార్యదర్శి దాసరి శ్రీనివాస్ మరియు ఇతర నాయకుల తో కలిసి ఇంటెక్ వెల్ పరిసర ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఆదివారం ప్లే డె సందర్భంగా మొదటి షిఫ్ట్ లో ఇద్దరు పంపు ఆపరేటర్లను కేటాయించాల్సి ఉండగా సూపర్ వైజర్ అశోక్ కుమార్ ఒక్కరినే కేటాయించడం సరైంది కాదని ఆయన అన్నారు. గత వారం డ్యూటీ లు నిర్వహిస్తున్న పంప్ ఆపరేటర్ కి గుండె నొప్పి రావడం తో, ఇంకొక పంప్ ఆపరేటర్ సహాయంతో హాస్పిటల్ కి తీసికెళ్ళడం జరిగిందని ఆయన అన్నారు.

సంబంధిత హాస్పిటల్ డాక్టర్లు ఆ పంప్ ఆపరేటర్ ని పై స్థాయి హాస్పిటల్ కి రెఫర్ చేయడం జరిగిందని,పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి ప్రతి రోజు షిఫ్ట్ కి ఇద్దరు పంప్ ఆపరేటర్ లను కేటాయించాలని,అదేవిధంగా ఇక్కడ ఉన్న స్మశాన వాటికలో నిత్యం మరణించిన వారి అంత్యక్రియలు జరుగుతాయని, అదేవిధంగా ఇంటెక్ వెల్ వద్ద విపరీతంగా శబ్దం వస్తుందని, దీని వల్ల పని చేస్తున్న కార్మికులు అనారోగ్యాలకు గురి అవుతున్నారుని ఆయన అన్నారు. యాజమాన్యం స్పందించి ఇంటెక్ వెల్ వద్ద షిఫ్ట్ కు ఇద్దరు పంపు ఆపరేటర్లు విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు తాని రాజబాబు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Two pump operators should

You cannot copy content of this page

Scroll to Top