అల్లూరిజిల్లా(అనంతగిరి) త్రినేత్రం న్యూస్ జులై 21 : తణుకు లో జులై 18న జరిగిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో అరుకు గిరిజన గురుకుల క్రీడా పాఠశాల విద్యార్థులు అద్భుత విజయాలను సాధించారు. అండర్-11 విభాగంలో కొర్ర జెర్మీ ఫాల్ (తండ్రి చిన్నారావు), చరణ్, సాయిరామ్; అండర్-13లో సుజిత్, యశ్వంత్ తేజ్, జగదీష్; అండర్-15లో మహేంద్రదాస్, శశిధర్ రెడ్డి, రాజా రితేష్, రాజేష్ రెడ్డి అర్హత సాధించారు.
అనంతగిరి మండలం ఎగువ శోభకు చెందిన జెర్మీ ఫాల్ విజయంతో ఆయన కుటుంబానికి గర్వకారణంగా నిలిచింది. క్రీడా శిక్షకుల మార్గదర్శకత, తల్లిదండ్రుల త్యాగంతో గిరిజన విద్యార్థులు క్రీడా రంగంలో రాణిస్తున్నారని స్థానిక జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి ప్రశంసించారు. యువ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తే, దేశానికి గొప్ప మాణిక్యాలు లభిస్తాయని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


