సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Bus overturns

Bus Overturns : త్రినేత్రం న్యూస్ : హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. తిస్సా–బైరాగఢ్ రహదారిపై చలుజ్ మోర్ సమీపంలో శనివారం ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని తిస్సా సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page