నవంబర్ 5, 2026
TRINETHRAM NEWS
MLA inspect

MLA inspect : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 04; మురుసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న బర్రింకాలపాడు నుంచి జీలుగుమిల్లి వరకు ఉన్న జాతీయ రహదారితో పాటు పి. అంకంపాలెం ప్రాంతాన్ని పోలవరం నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు సందర్శించి పరిశీలించారు..తుఫాన్ కారణంగా రహదారులకు జరిగిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారులపై ఏర్పడిన నష్టాలను త్వరితగతిన గుర్తించి, ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా చిర్రి బాలరాజు మాట్లాడుతూ, తుఫాన్ ప్రభావం నేపథ్యంలో పోలవరం నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ముఖ్యంగా కొండవాగులు, రహదారుల మధ్య ప్రవహించే వాగుల్లో నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున ప్రజలు వాటిని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పరిస్థితులు పూర్తిగా చక్కబడే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులకు సహకరించాలని ఆయన పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page