త్రినేత్రం న్యూస్, డిసెంబర్ 06, రాజమహేంద్రవరం. రచ్చబండ కోడ్ సంతకాలు సేకరణ కార్యక్రమం పై ఈరోజు బోమ్మూరు పార్టీ కార్యాలయం నుంచి తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ మరియు జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తి అధ్యక్షతన గూగుల్ మీట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఏడు నియోజకవర్గల కో-ఆర్డినేటర్లు మరియు ముఖ్య నేతలు జిల్లా పార్టీ కార్యవర్గం మొత్తం అందరూ హాజరయ్యారు తొలుత వేణు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రజలకు దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా చెప్పట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం త్వరగతిన పూర్తి చేసి ఈ నెల 10 వ తారీకున జిల్లా పార్టీ కార్యాలయానికి అందజేయాలనీ 13 వ తేది నాడు జిల్లాలోని ముఖ్య నాయకులతో కలిసి కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపడం జరుగుతుందని ఈ సమావేశంలో తెలియజేశారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


