బీఆర్ అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శం
రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెప్తారు
లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నిలవదు
పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పార్టీ నేతలు
త్రినేత్రం న్యూస్ డిసెంబర్06. అనపర్తి నియోజకవర్గం, భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శనీయమని అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, కొనియాడారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు అనపర్తి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మరియు పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లో నేడు రాష్ట్రంలో రెడ్ బుక్ అమలవుతోందని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, విమర్శించారు.వాక్ స్వాతంత్ర్యాన్ని హరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తప్పక బుద్ధి చెప్తారని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్; వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, అనపర్తి గ్రామ సర్పంచ్ వారా కుమారి, మహిళా విభాగం అధ్యక్షురాలు ఇమ్మంది విజయ కుమారి, పంచాయతీ 15వ వార్డు సభ్యులు తేతలి రామకృష్ణారెడ్డి(యాసిడ్ రాము), ఎస్సీ సెల్ నాయకులు కొమ్మరి అబ్రహం, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు తిరగటి శివ, జిల్లా ఎస్సీ సెల్ నాయకులు నందికోళ్ల రవి, ఎస్సీ సెల్ నాయకులు బత్తుల రవి, ఎంపీపీ కర్రి దాసు, ఎస్సీ సెల్ నాయకుల రవికుమార్, పంచాయతీ వార్డు సభ్యులు డేవిడ్ రాజ్, ఎంపీటీసీ సభ్యులు తుమ్మ సత్యనారాయణ రాజేశ్వరి, ఎంపీటీసీ సభ్యులు కొండేటి భీమేష్, ఎంపీటీసీ సభ్యులు బండారు శ్రీనివాస్, బీసీ సెల్ నాయకులు శంకర్ బాబి, బీసీ సెల్ నాయకులు కానూరి కృష్ణ , మండల నాయకులు సునీల్, రైతు విభాగం నాయకులు వీరయ్య కాపు, ఎస్సీ సెల్ నాయకులు సోమిరాజు, పార్టీ నాయకులు కర్రి గాంధీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


