District Duty Meet : జిల్లా పోలీస్ కార్యాలయంలో “డిస్ట్రిక్ట్ డ్యూటీ మీట్” విజయవంతం: ఎస్పీ కె. నారాయణ రెడ్డి ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరు

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి :ఈ రోజు వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో “డిస్ట్రిక్ట్ డ్యూటీ మీట్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ కె. నారాయణ రెడ్డి, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై, పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి మార్గదర్శనం చేశారు. ఈ మీట్‌లో వివిధ విభాగాలలో పోలీస్ సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపరచడానికి మరియు వారి ప్రతిభను ప్రదర్శించడానికి పలు పోటీలను ఏర్పాటు చేశారు.

జిల్లా ఎస్పీ 1)పరిశోధనకు శాస్త్రీయ సహాయాలు , 2)విధ్వంస నిరోధక తనిఖీ , 3)డాగ్ స్క్వాడ్ పోటీ , 4)కంప్యూటర్ అవగాహన , 5)ఫోటోగ్రఫీ మరియు 6)వీడియోగ్రఫీ పోటీలు పర్యవేక్షించడం జరిగింది. ఈ పోటీలలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అత్యంత ఉత్సాహంగా, చురుకుగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ డ్యూటీ మీట్ అనేది పోలీస్ శాఖలో సిబ్బందికి కేవలం ఒక పరీక్ష కాదు, ఇది వారి నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడానికి, మరియు అత్యుత్తమ సేవలందించి ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి ఒక సమగ్ర వేదిక. ఇది పోలీస్ వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని పెంచి, శాంతిభద్రతల పరిరక్షణలో మరింత పటిష్టంగా పనిచేయడానికి దోహదపడుతుంది. ఈ పోటీలలో పాల్గొన్న వారందరినీ అభినందించారు. భవిష్యత్తులో జరిగే అన్ని స్థాయి పరీక్షలలో కూడా అదే స్ఫూర్తితో పాల్గొని, తమ అద్భుతమైన ప్రతిభతో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఈ డిస్ట్రిక్ట్ డ్యూటీ మీట్‌లో యూనిట్ స్థాయిలో ఎంపికైన విజేతలు తదుపరి జోనల్ స్థాయి పోటీలలో పాల్గొంటారు. ఈ జోనల్ స్థాయి పోటీలు జులై నెలలో సంగారెడ్డిలో నిర్వహించబడతాయి. జోనల్ స్థాయిలో అర్హత సాధించిన వారిని రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్‌కు ఎంపిక చేస్తారు. ఈ తెలంగాణ రాష్ట్ర 2వ డ్యూటీ మీట్ వరంగల్‌లో జరుగుతుంది అని తెలిపినారు.చివరగా, రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు మహారాష్ట్రలో నిర్వహించబడే 69వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ 2025-2026లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు అని తెలిపినారు.ఇట్టి కార్యక్రమం లో DCRB DSP జానయ్య , AR DSP వీరేష్ , CI లు, RI లు, SI లు, RSI లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

"District Duty Meet" at

You cannot copy content of this page

Scroll to Top