Collector Prateek Jain : ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని విద్యను అభ్యసించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి గురువారం అంతర్జాతీయ బాలల హక్కుల, జాతీయ గ్రంథాలయ దినోత్సవాల సందర్భంగా జిల్లా గ్రంధాలయ సంస్థలో సమావేశ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ… మహనీయుల మార్గంలో వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రులయ్యారని, భారత ప్రజలకు మంచి రాజ్యాంగాన్ని రూపొందించారని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు వివిధ భాషల పట్ల పట్టును సాధించుకోవడం వల్ల కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి వీలవుతుందని కలెక్టర్ తెలిపారు.

చదువుతోపాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్కరు చిన్నప్పటినుండే ప్రతి ఒక్కరూ కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆయన సూచించారు. చదువు ద్వారానే సమాజంలో మంచి గుర్తు తీసుకువస్తుందని, మన తల్లిదండ్రులకు కూడా గౌరవాన్ని పెంపొందించే దిశగా ప్రతి ఒక్కరూ మెదలుకోవాలని కలెక్టర్ తెలిపారు. చదువే ఒక ఆయుధంగా మలుచుకొని జీవితాన్ని గొప్పగా తీర్చి దిద్దుకోవాలని కలెక్టర్ సూచించారు. భాష ద్వారానే మన భావాన్ని తెలుపవచ్చని, అందుకే ప్రతి భాష మీద పట్టు సాధించుకోవాలని కలెక్టర్ సూచించారు. మా పెద్దల ద్వారానే నేను కూడా గ్రంథాలయాలకు వెళ్ళే అలవాటును నేర్చుకున్నానని, ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలయాలకు వెళ్ళే అలవాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
గ్రంధాలయ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా గ్రంథాలయంలో సౌకర్యాలు కల్పించామన్నారు. గ్రంధాలయ అభివృద్ధికి జిల్లా కలెక్టర్ తోడ్పాటు ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.

ఈ సందర్భంగా బాలల హక్కులపై ప్రతిజ్ఞ డి డబ్ల్యూ ఓ కృష్ణవేణి ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థినిలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వ్యాసరచన, రంగోలి, మెహందీ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సురేష్ బాబు, డిపిఆర్ఓ చెన్నమ్మ, గ్రంథాలయ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Collector Prateek Jain said that students should take inspiration from Ambedkar

You cannot copy content of this page

Scroll to Top