మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు…
త్రినేత్రం న్యూస్. సౌదీ అరేబియా పవిత్ర మక్కా ఉమ్రాయాత్ర ముగించుకుని మదీనా నగరానికి వెళుతున్న యాత్రికుల బస్సు మార్గమధ్యలో ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొని మంటలు చెలరేగి ఆ మంటల్లో 42 మంది సజీవ దహనం అయిన సంఘటన పట్ల రాజమండ్రి రూరల్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ 42 మంది మృతుల ఆత్మ శాంతి కోసం నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. మృతి చెందిన వారందరికీ స్వర్గ ప్రాప్తి లభించాలని ఇమామ్ ఇర్షాద్ దువా చేశారు.
మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ఇది చాలా దురదృష్ట సంఘటనని ఏదైనాప్పటికీ దైవ నిర్ణయాన్ని శిరసా వహించాలని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబాలకు ఆ అల్లాహ్ జరిగిన నష్టాన్ని తట్టుకునే సహనాన్ని ధైర్యాన్ని ఇవ్వాలని అన్నారు .
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి మీర్జా మౌలాలి, జిల్లా మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు ఎండి హమీద్ బాషా, ప్రధాన కార్యదర్శి ఎస్.కె ఇబ్రహీం బాషా, కార్యదర్శులు ఎస్.కె మౌలాలి, ఎండి మస్తాన్ బేగ్, ఎస్ కె మీరావలి, అధికార ప్రతినిధి ఎండి కరీం బాషా, రూరల్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్.కె చానా, రూరల్ మరియు కడియం మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎస్.కె మహబూబ్ (బాజీ ), ఎండి సర్కార్ బాషా, మండల యువజన విభాగం కార్యదర్శి ఎస్.కె నన్ను, రజా మస్జీద్ అధ్యక్షులు హాజీ జిలాని, ఇమామ్ ఇర్షాద్, షకీలా బేగం షరీఫ్, అబ్దుల్ రెహమాన్,సయ్యద్ ముస్తఫా, ఎండి జాకీర్ హుస్సేన్, మీర్జా నిషార్ అబ్బాస్, షేక్ బాషా, షేక్ ముస్తఫా, షేక్ చిష్టి, షేక్ రెహమాన్ మరియు వివిధ విభాగాల నాయకులు, మైనార్టీ సెల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


