ప్రాథమిక పాఠశాల విద్యార్థికి కరెంట్ షాక్ ప్రభుత్వ హాస్పిటల్లో అందుబాటులోనే డాక్టర్లు
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం ప్రాథమిక పాఠశాల బయట ఎలాంటి రక్షణ కంచ లేకుండా 33 కె.వి ట్రాన్స్ ఫారం పాఠశాల ప్రహరీ గోడకు అనుకొని ఉండటంతో బుధవారం ఆ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న వంశీ మధ్యాహ్న సమయంలో భోజనం చేయడానికి పాఠశాల బయటకు వస్తున్న నేపథ్యంలో పాఠశాల ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న 33 కెవి ట్రాన్స్ ఫారం అనుకోకుండా ట్రాన్స్ఫారం వైర్లు తగిలి చేతులు కాళ్లు కాలాడమే కాకుండా తలకు గాయాలయ్యాయి ముక్కు నుండి రక్తం కారుతున్న నేపథ్యంలో వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స కోసం డాక్టర్లు ఎవరూ లేకపోగా చిన్నపిల్లలకు సంబంధించిన సదుపాయాలు ఆస్పత్రిలో లేకపోవడంతో జిల్లా మండల అధికారితో మాట్లాడి పాఠశాల సిబ్బంది స్థానిక ప్రైవేట్ ఆసుపత్రి ఈశాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థి పరిస్థితి విషమంగానే ఉంది. కలెక్టర్ మీరైనా స్పందించి సకాలంలో ఆ విద్యార్థికి మెరుగైన వైద్య శిక్ష అందేలా చూడాలని పాఠశాల సిబ్బంది స్థానికులు కోరుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


