
Distribution Pattadar Pass Books : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 10 ; కైకలూరు నియోజకవర్గం, కలిదిండి మండలంలో నిర్వహించినటువంటి మీ భూమి – మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ఘనంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదగా ప్రభుత్వ రాజా ముద్ర తో కూడిన పాస్ పుస్తకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించారు.
ఆయనతో పాటు కలిసి మంత్రులు కొలుసు పార్థసారధి, నాదెండ్ల మనోహర్, అనగాని సత్య ప్రసాద్, జిల్లా కలెక్టర్ కె వెట్టి సెల్వి, కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. వాళ్లు మాట్లాడుతూ , రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి కులం ,మతం, పార్టీ భేదం తేడా లేకుండా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అందించామని తెలిపారు.ఇదే కూటమి ప్రభుత్వం నిరంతరం కొనసాగాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతుల భూమి హక్కులకు భద్రత కల్పిస్తూ, వాళ్ల ఆత్మగౌరవాన్ని కాపాడే దిశగా కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం రైతులకు మరింత భరోసానిచ్చింది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సి ఎస్) జి. సాయి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో ప్రజలు, పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి న రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, రవాణాకు అంతరాయం కలగకుండా చూసుకున్నారు. ప్రతి ఒక్కరికి భోజనం, మంచినీరు, సీడ్స్ వంటి ఆహార పదార్థాలను ఏర్పాటుచేసి అందించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe