Distribution of Clothes : పారిశుధ్య కార్మికులకు బట్టలు, నిత్యావసర వస్తువుల పంపిణీ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, రాజమహేంద్రవరం, జనవరి 13: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కాతేరు పంచాయితీ పారిశుధ్య కార్మికులకు బట్టలు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేసారు. 60మందికి పైగా కార్మికులకు రెండు జతల బట్టలు, తువ్వాళ్లు, నూనె , సబ్బులు గ్రామ పంచాయితీ కార్యదర్శి ఆధ్వర్యంలో పంపిణీ చేసారు.

గ్రామ పెద్దలు టిడిపి సీనియర్ నాయకులు గంగిన హనుమంత రావు, నున్న కృష్ణ, గంగిన నాని, ఆర్ట్ డైరెకర్ గంగిన గంగాభవాని, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దా మణి , నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు ఏసు, టిడిపి గ్రామ కమిటీ సెక్రటరీ కొల్లి వెంకట్రావు, టిడిపి యూనిట్ ఇంచార్జి సోమాల స్వామి, టిడిపి ఉపాధ్యక్షుడు కాళ్ళ వెంకటరమణ, బిజెపి నాయకులు ఆకుల నర్సవేణి , స్వామి కిరణ్, తదితరులు పాల్గొని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Distribution of clothes and essential items to sanitation workers

You cannot copy content of this page

Scroll to Top