దేవరకొండ డివిజన్ నవంబర్ 18 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పారదర్శకంగా, వేగవంతంగా చేరవేయడంలో భాగంగా నేడు దేవరకొండలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో సీఎం రిలీఫ్ ఫండ్, షాది ముబారక్ మరియు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు స్వయంగా చెక్కులు అందించారు.
ఈ సందర్భంగా మొత్తం 250 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 1 కోటి 18 లక్షల రూపాయల చెక్కులు, అలాగే షాది ముబారక్ మరియు కళ్యాణలక్ష్మి పథకాల కింద రూ. 75 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎంఆర్వోలు హనుమంతు శ్రీనివాస్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, జయశ్రీ, హర్షద్ మహమూద్, ప్రశాంత్, మండల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


