CITU : కాంట్రాక్టు కార్మికుల సీఎంపిఎఫ్ ను అప్డేట్ చేసి పాస్ పుస్తకాలు వెంటనే ఇవ్వాలి

TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సిఐటియు అనుబంధ సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు,రాష్ట్ర కార్యదర్శి. వేల్పుల కుమారస్వామి గోదావరిఖనిలోని రీజనల్ సీఎంపీఎఫ్ కార్యాలయంలో రీజనల్ కమిషనర్ 1,2 ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎంపిఎఫ్ గోదావరిఖని రీజియన్ కార్యాలయం పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం1,2,3, మరియు భూపాలపల్లి ఏరియాల పరిధిలో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికుల యొక్క సీఎంపీఎఫ్ 202-23 నుండి నేటి వరకు సీఎంపిఎఫ్ అప్డేట్ చేయలేదని, పాస్ పుస్తకాలు ఇవ్వలేదని అన్నారు. దీనివల్ల కార్మికుల్లో అనేక అపోహలు, అనుమానాలు ఉన్నాయని అన్నారు. అంతే కాకుండా కార్మికులు తీవ్ర ఆందోళనలు చెందుతున్నారని అన్నారు.వెంటనే సిఎంపిఎఫ్ ను అప్డేట్ చేసి, పాస్ పుస్తకాలు ఇవ్వాలని రీజనల్ కమిషనర్ ని కోరడం జరిగింది. దీనికి వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా తొందరలోనే కాంట్రాక్ట్ కార్మికుల సీఎంపిఎఫ్ ను అప్డేట్ చేసి పాస్ పుస్తకాలు అందిస్తామని చెప్పడం జరిగింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CMPF of contract workers should be updated

You cannot copy content of this page

Scroll to Top