Dismissed Workers : తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

TRINETHRAM NEWS
dismissed workers should be reinstated

Dismissed Workers : కృష్ణాజిల్లా : త్రినేత్రం న్యూస్ : మే 15; జిల్లా కేంద్రమైన మచిలీపట్నం సమీపంలో ఉన్నటువంటి గన్నవరం మండలం బుద్దవరం గ్రామపంచాయతీలో గత దశాబ్ద కాలంగా టెండరు విధానంలో పనిచేస్తున్న ఎస్ సుబ్బారావు, యం రత్నకుమారి, ఆర్ అంజనాదేవి, ఎన్ రంగమ్మ, కె కాసులు అనే ఐదుగురు కార్మికులను అకారణంగా తొలగించారని సిఐటియు మండల కన్వీనర్ బెజవాడ తాతబ్బాయి ఆరోపించారు.

కార్యాలయంలో జరిపిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పంచాయతీలను స్వర్ణ పంచాయతీలుగా మార్చే తరుణం లో పంచాయతీ లో ఎక్కువగా ఉన్న కార్మికులను తొలగించాలని ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు కార్మికులను తొలగిస్తున్నామనే సాకులు చెప్పి గత పది సంవత్సరాలనుండి పనిచేస్తున్న వారిని తొలగించడం దుర్మార్గం అని అన్నారు.

పంచాయతీ కార్యదర్శి జగదీష్ ప్రసాద్, గుమస్తా రామారావు లు చెప్పే విదంగా అదనంగా కార్మికులు ఉంటే చివరిగా విధుల్లో చేరిన వాళ్లను మొదట తొలగించాలనే నిబంధనలు పాటించ కుండా తొలగించడం లోనే వీరి వైఖరి తేట తెల్లం అవుతుంది అని అన్నారు. నాటి సర్పంచ్ కి కూడా తెలియకుండా నియమించిన శివాజీ అనే వ్వక్తిని యదా విధిగా కొనసాగిస్తున్నారని, అంతే కాకుండా గత ఐదు నెలల క్రితం కార్మికులు చాలడం లేదు అని ముగ్గురు కొత్త వాళ్లని తీసుకొని , వాళ్ళని కూడా కొనసాగిస్తున్నారని, గత ప్రభుత్వ కాలంలో గ్రీన్ అంబాసిడర్ లుగా తీసుకున్న వాళ్లను టెండర్ పద్దతి లోకి మార్పు చేసి కొనసాగిస్తూ పై పేర్లు గల ఐదు గురిని తొలగించడం అంటేనే వీరి వక్ర బుద్ది కనబడుతుంది అని అన్నారు. తొలగించిన కార్మికుల ను వెంటనే విధుల్లో కి తీసుకొని వాళ్లకి న్యాయం చేయాలని, లేని యెడల ప్రత్యక్ష ఆందోళన చేయవలసిన పరిస్థితి వస్తుంది అని దీనికి అధికారులదే బాధ్యత అని అన్నారు.

బాధిత కార్మికులు మాట్లాడుతూ మమ్మల్ని ఎందుకు తొలగిస్తువిషయంన్నారు అని అడిగితే ‘ఎవరిని తొలగించాలో, ఎవరిని ఉంచుకోవాలో అది మా ఇష్టం. అది మా వ్యక్తిగత నిర్ణయం’ అని సమాధానం ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం లో సిఐటియు నాయకులు బడుగు మరియదాసు, మిరప నాగేశ్వరావు పాల్గొన్నారు.

పంచాయతీ కార్యదర్శి జగధీష్ ప్రసాద్ వివరణ: కక్ష పూరితంగా కార్మికుల ను తొలగించారు అని బాధిత కార్మికులు ఆరోపిస్తున్నారు అని అడగగా, మాకు ఎవరి మీద ఏ విధమైన కక్ష లేదని పని విషయం లో బాద్యతా రాహిత్యం గా ఉన్న వారిని ఏరి తొలగించాము అని, మరలా పంచాయతీ కి అవసరం ఉంటే మొదటి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top