ఎస్.రామ్మోహన్, రాష్ట్ర అధ్యక్షులు.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సీఐటీయూ అనుబంధ పెద్దపల్లి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా 4వ మహాసభలు నిన్న(28/9/2025) శ్రామిక భవన్ సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రామ్మోహన్ హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని అన్నారు.అందులో ప్రధానంగా భవన నిర్మాణ కార్మికుల చట్టాలు అయిన కేంద్ర కార్మిక చట్టం, అంతరాష్ట్ర వలస కార్మికుల చట్టాలను 4 లేబర్ కోడ్ లలో కలిపారని అన్నారు. సెస్ నిధులను కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయకుండా ఇతర శాఖలకు మళ్లిస్తున్నారని అన్నారు. కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నారు అన్నారు.
ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం భవన నిర్మాణ కార్మికులు పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటీనీ ఎన్నుకోవడం జరిగింది. జిల్లా నూతన అధ్యక్షకార్యదర్షులుగా తుంగపిండి మల్లేష్, వేల్పుల కుమారస్వామి, కోశాధికారిగా గుండు కనుకయ్య, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, సరిగొమ్ముల మధు, మురుకుంట్ల భారతి, కె .సదానందం, మంథని సమ్మయ్య, సహయ కార్యదర్షులుగా సీపెల్లి రవీందర్,రాసపెల్లి పరమేష్, విజయలక్ష్మీ, బెక్కెం స్వామి,ఎం.కొమురయ్య కమిటీ సభ్యులుగా మహేందర్,మేకల శేకర్,బంగారి మోహన్, వై.సత్యనారాయణ, పొచం,అశోక్,రాజయ్య,అంజయ్య,హరీష్,జక్కుల రాజయ్య,కాసగాని అశోక్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


