ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
ప్రకాశంనగర్ రోడ్డు అభివృద్ధి పనులు పరిశీలన
రాజమహేంద్రవరం : నగర ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు. స్థానిక 8వ డివిజన్ ప్రకాశంనగర్‌లోని ఎఫెక్స్ ఆసుపత్రి దగ్గర నుంచి 805 మీటర్ల మేర రూ. కోటి 36 లక్షలతో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులను ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రోడ్డు చాలా రద్దీగా ఉంటుందని, ప్రధానమైన మార్గమన్నారు. అటువంటి రోడ్డు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నందున కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణం చేపట్టామన్నారు. గత ఐదేళ్లు వైకాపా వారికి ఈ రోడ్డు ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు.
పక్కనే ఉన్న దానవాయిపేట రోడ్డును 6 నెలల పాటు నిర్మించారని, దాని వల్ల ఆసుపత్రికి వచ్చే వెళ్లే వారికి, స్థానికంగా వ్యాపారాలు చేసుకునే వారు చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి పాలనలో జరుగుతున్న పనులన్నీ ఎవరీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు డబుల్ ఇంజన్ మాదిరగా వెళుతున్నాయన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఎలా ఉంటుందో గతంలోనే చెప్పామని, అదే రీతిలో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతోందన్నారు. నగరంలో చేపట్టే ప్రతి అభివృద్ధి పని ఒక అవగాహన, ప్రజల ఆలోచనలకు తగ్గట్టు చేస్తున్నామన్నారు. అభివృద్ధి ఒకే చోట కాకుండా నగరమంతటా జరిగే చూస్తున్నామన్నారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అవసరం లేక పోయినా డివైడర్లు, ఫుట్ పాత్ లు నిర్మించారని బడుగులు నివసించే ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.కూటమి ప్రభుత్వం వచ్చిన పది నెలల్లో తాము మార్పు చేసి చూపించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. గతానికి, ఇప్పటికీ జరిగిన తేడా ప్రజలు గమనించాలని కోరారు. రాజమండ్రి నగర ప్రజల 15 ఏళ్ళ కల సాకారం చేసేందుకు గోదావరి గట్టున రివర్ ఫ్రంట్ పనులకు అకురార్పణ జరిగిందన్నారు. రాజమండ్రిని టూరిజం హబ్ గా తీర్చిదిద్దే క్రమంలో రివర్ ఫ్రంట్ పనులకు శ్రీకారం చుట్టామని, రూ. 8 కోట్లతో అప్పర్ ప్రామినేట్ ముందుగా చేస్తున్నామని, లోయర్ ప్రామినేట్ పనులను రూ. 14 కోట్లతో చేస్తారని దీంతో మొత్తం రూ. 22 కోట్లతో రివర్ ఫ్రంట్ పూర్తవుతుందని ఆయన చెప్పారు. గోదావరి గట్టుకు, అక్కడ ఉన్న ప్రముఖుల విగ్రహాలకు మరింత శోభ చేకూర్చే విధంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


