Good Governance : అభివృద్ధి… సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన

TRINETHRAM NEWS

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

కూటమి ప్రభుత్వంలోనే ప్రజలందరికీ న్యాయం

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌

6… 31 డివిజన్లలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం
రాజమహేంద్రవరం : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, అభివృద్ధి… సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని, కూటమి అధికారం చేపట్టిన తరువాత ప్రజలందరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) అన్నారు. స్థానిక 6, 31వ డివిజన్లలో 4వ రోజు ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌…

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ కుడుపూడి సత్తిబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యర్రా వేణు గోపాల రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌ కుమార్‌, ఛాంబర్‌ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా తదితరులతో కలిసి 6వ డివిజన్‌ ఇన్‌ఛార్జ్‌ మజ్జి మణికంఠ, 31వ డివిజన్‌ ఇన్‌ఛార్జ్‌ చింతా జోగినాయుడు, మహిళా నాయకురాలు మాలే విజయలక్ష్మి తదితరుల పర్యవేక్షణలో ఇంటింటికీ వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అందచేసి స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ సత్వరం పరిష్కారం చేయాలని కార్పొరేషన్‌ అధికారులు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

గత ఐదేళ్లు వైకాపా చేసిన నిర్లక్ష్యం వల్ల ప్రజల సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. ఒక రేషన్‌ కార్డు కానీ, కొత్త పెన్షన్‌ కానీ మంజూరు కాలేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని, రేషన్‌ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు. ఎన్నికల ముందు వైకాపా వారు చట్టబద్దత లేని పట్టాలు ఇవ్వడం జరిగిందని, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చట్టబద్దత కల్పించి అర్హులకు సెంటు కాకుండా రెండు సెంట్ల భూమి ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. నగరంలో అవసరమైన ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం జరుగుతోందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Development... Welfare is the

You cannot copy content of this page

Scroll to Top