MLA Satyananda Rao : ప్రజలకు మేలు చేసే పాలన మాది

TRINETHRAM NEWS

కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు…..

కొత్తపేట : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కూటమి పాలనలో అమలవుతున్న సంక్షేమం, జరుగుతున్న అభివృద్ధిపై ప్రజల్లో సంతృప్తి కనబడుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శనివారం మోడేకుర్రులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. అందుతున్న సంక్షేమం, జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు.

తరువాత ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ వైసీపీలా తమది పరదాల పాలన కాదని, ప్రజాపాలన అని తెలిపారు. జగన్ ప్రజల్లోకి రావడానికే భయపడేవారని, పరదాలు కట్టుకుతిరిగేవారని, నేటి ప్రజాపాలనలో మన ముఖ్యమంత్రి నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారన్నారు. నాడు అరాచకం రాజ్యమేలితే నేడు అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జరుగుతుందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ours is a government

You cannot copy content of this page

Scroll to Top