త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరవళ్లు తొక్కుతున్నాయని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం మండపేట పట్టణంలో 18వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ పధకాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ ఒకే ఒక్క ఏడాది పాలనలోనే సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందిస్తుందని, రాష్ట్ర అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.
గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కంటే విధ్వంసమే అధికంగా కనిపించిందని వ్యాఖ్యానించారు. తల్లికి వందనంతో చరిత్ర సృష్టించాం అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్చలేక వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు అని విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా, ప్రజలు కూటమి ప్రభుత్వ పక్షానే ఉన్నారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు మచ్చా నాగు, మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, 6వ వార్డు కౌన్సిలర్ కాశిన కాశీ విశ్వనాధం, వార్డు అధ్యక్షులు దొంతంశెట్టి సురేష్, సంకు శివ, ఆకుల సత్తిబాబు, సాధనాల చక్రపాణి, బత్తుల గణపతి, జొన్నపల్లి సూర్యారావు, శివకోటి శేఖర్, నరిగిరి బాపయ్య, నెల్లిపూడి సత్యనారాయణ, తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


