అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి
హామీల అమలులో ఘోర విఫలం
Trinethram News : బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో ప్రచారం చేద్దాం అనపర్తి: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ప్రజల పక్షాన పోరాటం కూటమి ఏడాది పాలనలో సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు ఎగనామం పెట్టారు కొత్తగా అభివృద్ధి ఎక్కడా కన్పించలేదు. ఇటువంటి తరుణంలో ప్రజల పక్షాన పోరాటం చేద్దాం.వైయస్‌ఆర్‌సీపీ అధిష్టానం పిలుపునిచ్చిన ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలను చైతన్యవంతులను చేద్దాం’ అని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పిలుపునిచ్చారు. ఈరోజు బిక్కవోలు మండలం విస్తృతస్థాయి సమావేశం,బిక్కవోలు గ్రామంలో జరిగింది.
హామీల అమలుపై నిలదీద్దాం
అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏడాదికి రూ.20వేలు, నిరుద్యోగులకు రూ.3వేలు, 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1500, అలాగే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు కోసం ప్రభుత్వాన్ని నిలదీద్దామని పార్టీ శ్రేణులకు పోతుల ప్రసాద్ రెడ్డి(బుజ్జి), పిలుపునిచ్చారు.
గత వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో మన నియోజకవర్గాన్ని,అలానే బిక్కవోలు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాము అని గుబ్బల లాజర్ బాబు(మండల అధికార ప్రతినిధి) పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు, బెదరింపులకు భయపడకుండా వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు గట్టిగా నిలబడ్డారని, ఇదే స్ఫూర్తితో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాల గురించి వివరిద్దామని సబ్బెళ్ల కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
కూటమి పాలన అడుగడుగునా దగా అని కలిశెట్టి పాల్గున్న (మండల రైతు విభాగం అధ్యక్షులు) పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సబ్బెళ్ళ కృష్ణా రెడ్డి (అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్) పోతుల ప్రసాద్ రెడ్డి బుజ్జి (మండల పార్టీ కన్వీనర్), బొడ్డు ముత్యాలరావు (రాష్ట్ర బూత్ కమిటీ సెక్రటరీ),
బుద్దల కన్నారావు, కోరుకొండ నాగేశ్వరావు, తమ్మిరెడ్డి నాగ శ్రీనివాసరెడ్డి, రవీంద్ర పాపారెడ్డి, గండికోట వీర భద్రరావు(రంగాపురం గ్రామసర్పంచ్), ఇల్లపల్లి సతీష్, కొవ్వూరు వెంకట రామారెడ్డి, మేడపాటి ఆనంద్ రెడ్డి, గుబ్బల లాజర్ బాబు (మండల అధికార ప్రతినిధి), సత్యంశెట్టి వెంకటరమణ (కాపవరం సర్పంచ్), మారెళ్ళ భీముడు, కర్రి త్రినాధ్ రెడ్డి, విస్సకోటి సుబ్బారావు, సత్తి హరిప్రసాద్ రెడ్డి, సత్తి నాగిరెడ్డి రాజా, ఎంపీటీసీ పీవీ, ఆనంద్, లాయర్ శ్రీను, సత్తిబాబు, ఊలపల్లి మాజీ సొసైటీ అధ్యక్షులు గండ్రల విజయశేఖర్ రెడ్డి, గులపల్లి రాంబాబు, తొండాపు కాశీ, అరికిరేవుల వాసిరెడ్డి వాసు (మండల ప్రసార కమిటీ అధ్యక్షులు),తోటపేట మల్లేశ్వరరావు, తదితరులు పార్టీ నాయకులు, మండల నేతలు,గ్రామ నేతలు, యువజన విభాగం ప్రతినిధులు, మహిళా విభాగం సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


