
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
Education Powerful Tool : దేవరకొండ, ఆగస్టు 7: త్రినేత్రం న్యూస్ : ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామ పరిధిలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల (మహిళల)లో నిర్వహించిన “ఇతిహాస్” కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, ఆదివాసీల చరిత్ర, సంస్కృతి, జీవన విధానం, ప్రకృతితో వారి అనుబంధాన్ని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప సందర్భమని అన్నారు.
తెలంగాణలో లంబాడ (బంజారా), గోండు, కొలాం, నాయక్‌పోడ్, కోయ, కొండరెడ్డి, చెంచు, తోటి, పర్ధాన్, ఆంధ్, కోంద్, ఎరుకల, సవర (సౌర), గదబ తదితర అనేక గిరిజన తెగలు తమ ప్రత్యేక జీవన విధానాలతో రాష్ట్ర సాంస్కృతిక వైవిధ్యాన్ని మరింత సుసంపన్నం చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి తెగకు ప్రత్యేకమైన భాష, వేషధారణ, ఆచారాలు, జానపద కళలు, సంప్రదాయాలు, పండుగలు, నృత్యాలు, సంగీతం ఉన్నాయని, అదే మన రాష్ట్ర సాంస్కృతిక సంపదకు గొప్ప గుర్తింపు అని అన్నారు.
ఆదివాసీ విద్యార్థులు తమ పూర్వీకుల గొప్ప చరిత్ర, సంస్కృతిని గౌరవిస్తూ ఆధునిక విద్యలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, డిగ్రీ కళాశాలలు, ఉన్నత విద్యా అవకాశాలు, స్కాలర్‌షిప్‌లు, వసతి సౌకర్యాలు కల్పిస్తూ వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోందని తెలిపారు.
చివరగా, “మీ అందరిలో అపారమైన ప్రతిభ ఉంది. ఆ ప్రతిభను విద్య ద్వారా వెలికితీయండి. రేపటి తెలంగాణకు మీరు గర్వకారణంగా నిలవాలి. మీ విజయమే మీ తల్లిదండ్రులకు, Zero గ్రామానికి, గిరిజన సమాజానికి నిజమైన గౌరవం” అని ఎమ్మెల్యే బాలు నాయక్ విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన గురుకుల కార్యదర్శి సీతాలక్ష్మి, డిప్యూటీ సెక్రటరీ వేణుగోపాల్ రెడ్డి, RCO శ్రీనివాస రాయ్, ప్రిన్సిపాల్ హరిప్రియ, మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్, వైస్ ప్రిన్సిపాల్ శ్వేత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe