
Teaching Profession Sacred : డిండి (గుండ్లపల్లి) ఆగష్టు 07, త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉద్యోగ విరమణ-అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పదవి విరమణ పొందిన ప్రధానోపాధ్యాయుడు లింగిరి సత్యనారాయణ అచ్చమ్మ దంపతులను అధికారులు ఉపాధ్యాయులు నాయకులు మరియు విద్యార్థిని విద్యార్థులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 29 ఏళ్ల పాటు ఉపాధ్యాయుడిగా సత్యనారాయణ ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థానాలకు వెళ్లేందుకు తీర్చిదిద్దాడని , పాఠశాలకు ఆయన చేసిన సేవలు గురించి కొనియాడారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe