త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి.. వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికై, ప్రమాణ స్వీకారం చేసి, పదవీ బాధ్యతలు స్వీకరించిన 17 వ వార్డు కౌన్సిలర్, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె గడ్డం అనన్య.
ముందుగా నూతనంగా ఎన్నికైన 34 మంది వార్డు కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించిన ఇంచార్జి ఎన్నికల అధికారి, జిల్లా అడిషనల్ కలెక్టర్ సుదీర్.
మున్సిపల్ చైర్మన్ స్థానానికి 17 వ వార్డు కౌన్సిలర్ గడ్డం అనన్య ఏకైక నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన అధికారులు. అనంతరం వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా గడ్డం అనన్య తో ప్రమాణ స్వీకారం చేయించిన ఎన్నికల అధికారి సుదీర్.
అనంతరం వైస్ చైర్మన్ గా 10 వ వార్డు కౌన్సిలర్ అర్ధ సుధాకర్ రెడ్డి ని ఎన్నుకున్న కౌన్సిలర్లు. ఎక్స్ అఫీషియో మెంబర్ హోదాలో సమావేశానికి హాజరైన వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ .
ఈసందర్భంగా మున్సిపల్ చైర్మన్ గడ్డం అనన్య కి, వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి కి మరియు వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, బంధువులు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


