ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
Scientific Cultivation Essential

జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు వంతల దేవదాసు

Scientific Cultivation Essential : డుంబ్రిగూడ ఆగస్టు 8, (త్రినేత్రం న్యూస్): ఎల్ నినో ప్రభావం కారణంగా ఏర్పడే వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని పంటల సాగు చేపట్టాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు వంతల దేవదాసు సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రిగూడ మండలం, సాగర పంచాయతీలో శుక్రవారం నాడు రైతుల కోసం నిర్వహించిన “ఎల్‌నినో ప్రభావం నివారణ, కార్యాచరణ ప్రణాళిక” అవగాహన కార్యక్రమంలో దేవదాసు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావంపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత, నేలలో తేమ తగ్గడం వంటి సమస్యలు ఏర్పడి పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
అలాగే నీటి పొదుపు చర్యలు, నేలలో తేమ సంరక్షణ, సూక్ష్మ సేద్య విధానాలు, పంట మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగు వంటి ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖ అందిస్తున్న సాంకేతిక సూచనలు, వాతావరణ ఆధారిత సలహాలు, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వర్షాభావ పరిస్థితుల్లో పంట నష్టాలను తగ్గించేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ దీపిక, ఎఫ్‌పీఓ సభ్యులు, రైతు సాధికార సంస్థ సిబ్బంది సొన్ను, రైతులు, మహిళా రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఎల్‌నినో ప్రభావం, పంట సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచార పోస్టర్‌ను ప్రదర్శించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page