
Daylight Robbery : త్రినేత్రం న్యూస్ : Mar 18, 2026, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మంగళవారం పట్టపగలు దారుణం జరిగింది. భూమి రిజిస్ట్రేషన్ కోసం బ్యాంకులో డ్రా చేసిన రూ.8 లక్షల నగదును స్కూటీ డిక్కీలోంచి దొంగలు అపహరించుకెళ్లారు. శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి తన స్కూటీపై తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోగానే, సీసీటీవీల్లో రికార్డయిన దృశ్యాల ప్రకారం, ఇద్దరు దొంగలు అతన్ని అనుసరిస్తూ వచ్చి, క్షణాల్లో డిక్కీ తెరిచి నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

