జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Penalty for negligence

Penalty for Negligence : త్రినేత్రం న్యూస్ : Mar 18, 2026, ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. ఏప్రిల్ 4 నుంచి మూల్యాంకనం జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూల్యాంకనం విషయంలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే జరిమానా విధించేలా పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌లో తప్పులు చేసినా, మార్కుల నమోదులో పొరపాట్లు జరిగినా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

You cannot copy content of this page