Primary Health Center : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వికారాబాద్ ప్రైమరీ హెల్త్ సెంటర్

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయబడిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి శ్రీ ఎమ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పొగాకును పొగాకు ఉత్పత్తులను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా హాజరైన డాక్టర్లతోనూ, ఆసుపత్రి సిబ్బందితోనూ, ఎఎన్ఎమ్ మరియు ఆశా వర్కర్లుతో ప్రమాణం చేయించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గురించి వివరించారు. చట్టాలపై అవగాహన కల్పించారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్వయంగా ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్-15100 ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ టి. వెంకటేష్ , డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ పి రాము, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం. శ్రీనివాస్ , ప్యానల్ న్యాయవాది సుధాకర్ , పోలీసు సిబ్బంది మరియు డిహెచ్ఎంవో డిప్యూటీ డిహెచ్ఓ డాక్టర్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల దగ్గర నిర్మాణ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో కార్మికులకు పొగాకు వాడటం వలన కలిగే దుష్పరిణామాల గురించి మరియు పొగాకు ఉత్పత్తులపై ఉన్న నిషేధాల గురించి, చట్టాల గురించి, దాని పర్యవసానాల గురించి వివరించారు. పొగాకు నిర్మూలన గురించిన ప్రమాణం చేయించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలకు కనీస అవసరాలకు సంబంధించి వసతులు కల్పిస్తున్నారా లేదా అనే విషయాలను గురించి అక్కడి సూపర్వైజర్లను కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఎదురైన టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సలహాలు తీసుకోవాలని అలాగే ప్రభుత్వ న్యాయవాదుల సేవలను అందుకోవాలని తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vikarabad Primary Health Center

You cannot copy content of this page

Scroll to Top