Mon. Mar 9th, 2026

Indian Railways : భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం

TRINETHRAM NEWS

Trinethram News : భారతీయ రైల్వేలో పార్సిల్ యాప్‌తో సరికొత్త అధ్యాయానికి దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. రైల్వే వినియోగదారులకు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘రైల్‌ పార్సిల్‌ యాప్‌’ పేరుతో లాజిస్టిక్ సర్వీస్‌ను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది.

దక్షిణ మధ్య రైల్వే – హైదరాబాద్ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో రైల్ పార్సిల్ యాప్‌ని డెవలప్ చేసింది. సికింద్రాబాద్ రైల్వేలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ రైల్ పార్సిల్ యాప్‌ని లాంచ్ చేశారు.

మొదటగా 7 నగరాల్లో..

ఇంటి వద్దనే పార్సిల్‌ బుకింగ్‌, డెలివరీ సర్వీసులను అందించే లక్ష్యంతో ‘రైల్‌ పార్సిల్‌ యాప్‌’ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. భారతీయ రైల్వేలో తొలిసారిగా ఈ పైలట్‌ ప్రాజెక్టును హైదరాబాద్‌ డివిజన్‌లో అమలు చేయడానికి దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. మొదటగా 7 నగరాల్లో ‘రైల్‌ పార్సిల్‌ యాప్‌’ సేవలను ప్రారంభించింది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, బెంగళూరు, చెన్నైలలో ఈ సర్వీసులని అందుబాటులోకి తెచ్చింది. దక్షిణ మధ్య రైల్వే.. ఇతర మూడు లాజిస్టిక్ పార్టన్స్‌తో కలిసి డోర్ టు, మిడిల్, మెయిన్ డెలివరీ సర్వీసులకి శ్రీకారం చుట్టింది.

మీ ఇంటి వద్ద నుంచే ఈ యాప్ సేవలు..

ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ మాట్లాడారు. ప్రజలు నేరుగా మీ ఇంటి వద్ద నుంచే ‘రైల్‌ పార్సిల్‌ యాప్‌’ సేవలని వినియోగించుకోవచ్చని సూచించారు. ఈ యాప్‌తో అతి సులువుగా, వేగంగా పార్సిల్స్ సేవలని అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు.

దీంతో పాటు దక్షిణ మధ్య రైల్వేలో ఫ్రైట్‌ లాజిస్టిక్స్‌ మార్కెట్‌పై అధ్యయనం చేయడానికి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)- బెంగళూరుతో అవగాహన ఒప్పందం చేసుకుందని వివరించారు.

వన్‌స్టాప్ వేదికగా ఈ యాప్‌ ..

రైల్‌ పార్సిల్‌ యాప్‌.. ఫస్ట్‌ మైల్‌ (పికప్‌), మిడ్‌ మైల్‌ (రైల్వే ద్వారా రవాణా), లాస్ట్‌ మైల్‌ (డెలివరీ) సేవలను సమగ్ర డిజిటల్‌ ప్లాట్‌ఫాం ద్వారా అనుసంధానించేలా ఈ యాప్ సేవలు ఉంటాయని తెలిపారు. ఇది పార్సిల్‌ సేవలను సులభతరం చేస్తుందని తెలిపారు. వినియోగదారులు ఇంటి నుంచి పార్సిల్‌ సరుకులను బుకింగ్‌ చేయడానికి, ట్రాక్‌ చేయడానికి వన్‌స్టాప్ వేదికగా ఈ యాప్‌ ఉపయోగపడుతుందని వెల్లడించారు.

పరిశ్రమ, వినియోగదారులు, వ్యాపారాలు, లాజిస్టిక్స్‌ భాగస్వాములను ఒకే డిజిటల్‌ పర్యావరణ వ్యవస్థ కిందకు తీసుకురావడానికి ఈ యాప్‌ని రూపొందించామని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A new chapter in Indian Railways

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page