ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
MLA Balu Naik

దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ .

MLA Balu Naik : దేవరకొండ డివిజన్ ఆగష్టు 06, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. నేరేడుగొమ్ము నుండి కలకొండ తండా వరకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు (బ్యాలెన్సింగ్ వర్క్) నిర్మాణ పనులకు సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే గురువారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఈ రహదారి పూర్తయితే నేరేడుగొమ్ము, కలకొండ తండా ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

ముఖ్యంగా రైతులు తమ పంటలను పొలాల నుండి మార్కెట్‌కు వేగంగా తరలించేందుకు ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుందని, వ్యవసాయ ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు, గర్భిణీలు, వృద్ధులు, అత్యవసర వైద్య సేవలు పొందాల్సిన ప్రజలు ఆసుపత్రులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, గ్రామ సర్పంచ్ పులికంటి సుధాకర్, మాజీ జడ్పీటీసీ కేతావత్ బాలు నాయక్, మాజీ పీఏసీఎస్ చైర్మెన్ బైరెడ్డి కొండల్ రెడ్డి, మాజీ ఎంపీటీసిలు సీనియర్ నాయకుడు యుగేందర్ రెడ్డి, గిరి యాదయ్య, గడ్డం వెంకటయ్య, పరిసర గ్రామాల సర్పంచులు, కొప్పుల సురేందర్ రెడ్డి, స్థానిక ఉప సర్పంచ్ ఎలిజర్ల శ్రీను, వార్డు మెంబర్లు, రామావత్ మోహన్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, యువకులు, తండా వాసులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page