
CP Sajjanar : త్రినేత్రం న్యూస్ : Mar 31, 2026, తెలంగాణ : సైబర్ నేరాల నుండి ప్రజలను కాపాడడంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర చాలా కీలకమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ట్విట్టర్ లో తెలిపారు. ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా ఉన్న బ్యాంకర్లు, తమ కస్టమర్లు మోసపోకుండా అప్రమత్తం చేయాలని సూచించారు. ముఖ్యంగా డిజిటల్ మోసాలు లేదా పెట్టుబడి మోసాల బారిన పడినప్పుడు కస్టమర్ల ప్రవర్తనలో అసాధారణ మార్పులు గమనిస్తే, అది సైబర్ ముఠాల పనేమోనని అనుమానించి ఆరా తీయాలని అన్నారు.
వృద్ధులు, పెన్షనర్లు తమ జీవితకాలపు సంపాదనను కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని, అనుమానాస్పద లావాదేవీలు గమనిస్తే వెంటనే పోలీసులకు లేదా 1930, డయల్ 100 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. బ్యాంకర్లు, పోలీసులు, ప్రజలు సమన్వయంతో సైబర్ నేర రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

