జూన్ 26, 2026
TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 25 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఖాజా నగర్ కాలనీలో డ్రైనేజీ మరియు రోడ్లు సంబంధించిన సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ జి.ఎచ్.ఎం.సి అధికారులతో కలిసి కాలనీలలో పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించడం జరిగింది. కాలనీలో పుడుకుపోయిన డ్రైనేజీ లైన్ ను జి.ఎచ్.ఎం.సి ఎయిర్ టెక్ యంత్రం సహాయంతో పూడికను క్లియర్ చేయించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలో ప్రధానంగా ఉన్న డ్రైనేజ్ సమస్యను అతిత్వరలో పరిష్కరిస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. కాలనీ లోని డ్రైనేజ్ లైన్స్ కు సంబంధించి అవసమైన బడ్జెట్ ను ఎస్టీమషన్ వేసి ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొన్ని చోట్ల పెండింగ్ ఉన్న సీసీ రోడ్లను కూడా నిర్మిస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, పోశెట్టిగౌడ్, కైసర్, నవాజ్ ఖాన్, రజఖ్, ఇమామ్, సలీమ్, మహమూద్, ఖాసిమ్, మహమ్మద్ అలీ, గాఫర్, సమ్మద్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ మరియు శ్రీనివస్, సూపర్వైజర్ శివ, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Corporator Venkatesh Goud on

You cannot copy content of this page