Constable Dies : డీసీఎం ఢీకొని కానిస్టేబుల్ దుర్మరణం
Trinethram News : Feb 13, 2026, తెలంగాణ : నల్గొండ జిల్లా చందనపల్లి వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మునుగోడు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ షేక్ తయ్యూబ్ (30) మృతిచెందాడు.
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో విధులు ముగించుకుని స్వగ్రామం నకిరేకల్‌కు బైక్‌పై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టడంతో తయ్యూబ్ అక్కడికక్కడే మరణించాడు.
సమాచారం అందిన వెంటనే నల్లగొండ రూరల్ ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

